Army Public School RK Puram Recruitment 2026: టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – పరీక్ష లేదు! (పూర్తి వివరాలు)

సికింద్రాబాద్ లోని ప్రముఖ Army Public School (APS), RK Puram నుండి 2026 విద్యా సంవత్సరానికి గాను భారీ టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. PGT, TGT, PRT మరియు Art & Craft విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ లో “NO EXAM” (Non-OST Candidates) అనే వెసులుబాటు కల్పించారు. అంటే, ప్రస్తుతం AWES పరీక్ష రాయకపోయినా, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. ఈ పోస్ట్ లో అర్హతలు, ఖాళీలు, వయస్సు మరియు అప్లికేషన్ ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

వివరాలుసమాచారం
సంస్థ పేరుArmy Public School (APS), RK Puram
ఉద్యోగ రకంTeaching Staff (Term Basis)
పోస్టుల పేర్లుPGT, TGT, PRT, Art & Craft
పని ప్రదేశంఆర్.కె పురం, సికింద్రాబాద్ (Telangana)
అప్లికేషన్ విధానంOffline (By Post / By Hand)
చివరి తేదీ03 ఫిబ్రవరి 2026
ఎంపిక విధానంఇంటర్వ్యూ ద్వారా మాత్రమే

ఖాళీల వివరాలు (Vacancy Details):

ఈ నోటిఫికేషన్ ద్వారా కింది సబ్జెక్టులలో టీచర్లను నియమిస్తున్నారు:

  • PGT (Post Graduate Teachers): Biology, Psychology, Fine Arts.
  • TGT (Trained Graduate Teachers): English (5), Hindi (4), Science (3), Social Science (2), Maths, Computer Science, Sanskrit.
  • PRT (Primary Teachers): All Subjects (16 Posts), Computer Science, Art & Craft, Special Educator.
  • Pre-Primary Teachers: All Subjects (6 Posts).

విద్యార్హతలు (Eligibility Criteria):

  • PGT: సంబంధిత సబ్జెక్ట్ లో Post Graduation తో పాటు B.Ed లో 50% మార్కులు ఉండాలి.
  • TGT: Graduation తో పాటు B.Ed మరియు CTET/TET అర్హత ఉండాలి (60% మార్కులు).
  • PRT: Graduation తో పాటు 2 ఏళ్ల Diploma (D.El.Ed/B.El.Ed) మరియు CTET/TET అర్హత ఉండాలి.
  • Computer Teachers: BCA/B.Tech (CS/IT) లేదా తత్సమాన అర్హత.
  • Art & Craft: Fine Arts/Drawing/Painting లో డిగ్రీ లేదా డిప్లొమా.
  • Note: అభ్యర్థులకు ఇంగ్లీష్ మీడియం లో బోధించే సామర్థ్యం మరియు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.

వయస్సు (Age Limit):

  • Fresh Candidates (అనుభవం లేనివారు): 40 సంవత్సరాల లోపు ఉండాలి.
  • Experienced Candidates (5 ఏళ్ల అనుభవం ఉన్నవారు): 57 సంవత్సరాల లోపు ఉండాలి.

దరఖాస్తు విధానం (How to Apply):

ఈ ఉద్యోగాలకు కేవలం Offline పద్ధతిలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

1. ముందుగా అధికారిక వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫార్మ్ డౌన్లోడ్ చేసుకోండి.

2. ఫార్మ్ ను పూర్తిగా నింపి, దానికి మీ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను జత చేయాలి.

3. రూ. 250/- డిడి (DD) తీయాలి. (In favor of “ARMY PUBLIC SCHOOL RK PURAM”, payable at Secunderabad).

4. అప్లికేషన్ కవర్ పైన “Application for the post of _______” అని స్పష్టంగా రాయాలి.

5. చిరునామా: The Principal, Army Public School, RK Puram, Secunderabad – 500056.

6. చివరి తేదీ: 03 ఫిబ్రవరి 2026 లోపు అప్లికేషన్ స్కూల్ కు చేరాలి.

ఎంపిక విధానం (Selection Process):

  • వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ (Interview) ఉంటుంది.
  • ఇంటర్వ్యూలు ఫిబ్రవరి 2026 లో నిర్వహించే అవకాశం ఉంది.
  • ఈమెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు.

Important Links (ముఖ్యమైన లింకులు):

Official Website: https://www.apsrkpuram.edu.in

Download Notification & Form KOSAM

Watch Full Video for More Details:https://youtu.be/QVGNQWYt-r8

మేము అందించే సమాచారం అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా ఇవ్వబడింది. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఒకసారి అధికారిక వెబ్సైట్ ను సందర్శించి సరిచూసుకోగలరు.

Leave a Comment