Daily Current Affairs Quiz-17 (30-08-2025) September 1, 2025 by master 43 Daily Current Affairs-2025 Quiz-(17) 1 / 16 ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ సదస్సు 2025 ఎక్కడ నిర్వహించబడింది? A) హైదరాబాద్ B) న్యూ ఢిల్లీ C) విశాఖపట్నం D) బెంగళూరు ఈ సదస్సు 2025 ఆగస్టు 29న విశాఖపట్నంలో జరిగింది. 2 / 16 అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఇటీవల నియమితులైన RBI మాజీ గవర్నర్ ఎవరు? A) రఘురాం రాజన్ B) ఉర్జిత్ పటేల్ C) శక్తికాంత దాస్ D) మన్మోహన్ సింగ్ ఉర్జిత్ పటేల్ సెప్టెంబర్ 1, 2025 నుండి IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన RBI 24వ గవర్నర్గా 2016–2018 వరకు పనిచేశారు. 3 / 16 UDISE+ 2024–25లో ఉపాధ్యాయుల సంఖ్యలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్థానాలు ఏమిటి? A) తెలంగాణ 9వ, ఆంధ్రప్రదేశ్ 13వ B) తెలంగాణ 10వ, ఆంధ్రప్రదేశ్ 12వ C) తెలంగాణ 11వ, ఆంధ్రప్రదేశ్ 10వ D) తెలంగాణ 12వ, ఆంధ్రప్రదేశ్ 11వ ఉపాధ్యాయుల సంఖ్యలో తెలంగాణ 10వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 12వ స్థానం దక్కించుకున్నాయి 4 / 16 UDISE+ 2024–25 నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక ఉపాధ్యాయులు ఉన్న రాష్ట్రం ఏది? A) మహారాష్ట్ర B) రాజస్థాన్ C) ఉత్తరప్రదేశ్ D) బీహార్ దేశంలో అత్యధిక టీచర్లు ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. తరువాతి స్థానాల్లో రాజస్థాన్, మహారాష్ట్ర ఉన్నాయి. 5 / 16 నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ (NARI)–2025ని విడుదల చేసిన వారు ఎవరు? A) నితి ఆయోగ్ B) జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ C) మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ D) యునిసెఫ్ ఇండియా జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ ఈ నివేదికను జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయ్ రహత్కర్ విడుదల చేశారు. 6 / 16 ఇటీవల ఆరు నెలల పాటు పదవీకాలం పొడిగింపబడ్డ అణుశక్తి కమిషన్ చైర్మన్ ఎవరు? A) శేఖర్ బాసు B) అజిత్ కుమార్ మొహంతి C) సుకుమార్ బెనర్జీ D) ఆనిల్ కకోడ్కర్ అణుశక్తి కమిషన్ చైర్మన్ & అణుశక్తి శాఖ కార్యదర్శి అయిన అజిత్ కుమార్ మొహంతి పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. 7 / 16 ఇటీవల కేరళలో నమోదైన వ్యాధి ఏది? A) నిపా వైరస్ B) అమీబిక్ ఎన్సెఫలైటిస్ C) డెంగ్యూ జ్వరం D) లాసా ఫీవర్ కేరళలో ఇటీవల అమీబిక్ ఎన్సెఫలైటిస్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కలుషిత నీటిలో ఉండే అమీబా వలన వస్తుంది. 8 / 16 నైతిక విలువల ఉల్లంఘన ఆరోపణలపై పదవి నుంచి సస్పెండ్ చేయబడిన థాయిలాండ్ ప్రధాని ఎవరు? A) ప్రయుత్ చాన్-ఓ-చా B) పెటోంగ్టర్న్ షినవత్రా C) యింగ్లక్ షినవత్రా D) హున్ సెన్ పెటోంగ్టర్న్ షినవత్రా థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు మేరకు 39 ఏళ్ల వయసులో ప్రధానిగా ఉన్న పెటోంగ్టర్న్ షినవత్రా పదవి నుంచి సస్పెండ్ అయ్యారు. 9 / 16 3I/అట్లాస్ తోకచుక్కను కనుగొన్న టెలిస్కోప్ ఏది? A) హబుల్ స్పేస్ టెలిస్కోప్ B) జేమ్స్ వెబ్ టెలిస్కోప్ C) ATLAS సర్వే టెలిస్కోప్ D) కేప్లర్ టెలిస్కోప్ ATLAS (Asteroid Terrestrial-Impact Last Alert System) సర్వే టెలిస్కోప్ ద్వారా ఇది 10 / 16 జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం (National Small Industry Day) ఏ తేదీన నిర్వహించబడుతుంది? A) ఆగస్టు 15 B) ఆగస్టు 30 C) సెప్టెంబర్ 5 D) అక్టోబర్ 2 ప్రతి సంవత్సరం ఆగస్టు 30న జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రభుత్వం 2000లో చిన్న పరిశ్రమల అభివృద్ధికి విధాన ప్యాకేజీ ప్రకటించగా, 2001 నుండి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. 11 / 16 ఇండియా ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ సదస్సు 2025 ఎక్కడ నిర్వహించబడింది? A) హైదరాబాద్ B) న్యూ ఢిల్లీ C) విశాఖపట్నం D) బెంగళూరు 2025 ఆగస్టు 29న ఈ సదస్సు విశాఖపట్నంలో జరిగింది. 12 / 16 98వ ఆస్కార్ అవార్డులలో అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేట్ అయిన చిత్రం ఏది? A) RRR B) పాపా బుకా C) జై భీమ్ D) ది కాశ్మీర్ ఫైల్స్ రెండో ప్రపంచ యుద్ధంలో భారత సైనికుల పాపువా న్యూ గినియాలో పోరాటం నేపథ్యంగా రూపొందించిన చిత్రం ఇది. 13 / 16 2025 సంవత్సరానికి US నేషనల్ ఆర్చీ అవార్డు అందుకున్న భారతీయుడు ఎవరు? A) సత్య నాదెళ్ల B) రాజశేఖర్ కాళహస్తి C) సుందర్ పిచాయ్ D) అరవింద్ కృష్ణ గుంటూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ కాళహస్తి ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. 14 / 16 సేతుబంధ స్కాలర్షిప్ పథకం అమలు చేయబోతున్న ప్రధాన సంస్థ ఏది? A) IIT ముంబై B) IIT ఢిల్లీ C) IIT చెన్నై D) IIT ఖరగ్పూర్ ఈ స్కాలర్షిప్ పథకం Indian Institute of Technology Delhi లో అమలు చేయబడుతుంది. గురుకులల్లో కనీసం 10 సంవత్సరాలు చదివిన విద్యార్థులు IIT వంటి అగ్ర సంస్థల్లో higher studies, research చేయడానికి ఈ పథకం సహాయం చేస్తుంది. 15 / 16 రైల్వే బోర్డు ఛైర్మన్ పదవికి ఎంపికైన తొలి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఎవరు? A) అజిత్ కుమార్ మొహంతి B) సతీష్ కుమార్ C) రాకేష్ మోహన్ D) సుర్జిత్ భల్లా ఈ పదవికి ఎంపికైన తొలి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి సతీష్ కుమార్. 16 / 16 ఉర్జిత్ పటేల్ IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎన్ని సంవత్సరాల పాటు పనిచేయనున్నారు? A) 2 సంవత్సరాలు B) 3 సంవత్సరాలు C) 4 సంవత్సరాలు D) 5 సంవత్సరాలు ఆయన 2025–2028 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. Your score isThe average score is 60% 0% Restart quiz Telegram Group Join Now WhatsApp Group Join Now Instagram Page Follow Me