Daily Current Affairs Quiz-15 (28/08/2025) August 30, 2025 by master 47 Daily Current Affairs-2025-Quiz-(15) 1 / 24 BRICS బ్యాంక్ (NDB) ఏ సంవత్సరంలో స్థాపించబడింది? A) 2012 B) 2014 C) 2016 D) 2018 NDB, BRICS దేశాలచే 2014లో స్థాపించబడింది. New Development Bank (NDB) ప్రధాన కార్యాలయం చైనా, షాంఘైలో ఉంది. 2 / 24 BRICS బ్యాంక్ (NDB) కొత్త వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన రిస్క్ ఆఫీసర్ (CRO)గా ఎవరిని నియమించారు? A) శక్తికాంత దాస్ B) రాజీవ్ రంజన్ C) ఉర్జిత్ పటేల్ D) రఘురాం రాజన్ BRICS బ్యాంక్‌లో కొత్త వైస్ ప్రెసిడెంట్ & CROగా రాజీవ్ రంజన్ నియమితులయ్యారు. 3 / 24 ఎయిర్ బస్ భారత్–దక్షిణాసియా విభాగాలకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా ఎవరిని నియమించారు? A) గియోమ్ ఫౌరీ B) యూగెన్ వెస్ట్ మేయర్ C) టామ్ ఎండర్స్ D) ఆదిత్య ఘోష్ 4 / 24 ప్రస్తుత NATO సెక్రటరీ జనరల్ ఎవరు? A) జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ B) మార్క్ రుట్టే C) ఆంటోనీ బ్లింకెన్ D) బోరిస్ జాన్సన్ 2024లో మార్క్ రుట్టే NATO సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు. 5 / 24 భారత్–థాయ్‌లాండ్ మధ్య జరిగే 14వ మైత్రి ఉమ్మడి సైనిక విన్యాసాలు ఎక్కడ జరగనున్నాయి? A) లక్నో, ఉత్తరప్రదేశ్ B) ఉమ్రోయ్, మేఘాలయా C) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ D) పూణే, మహారాష్ట్ర 14వ మైత్రి విన్యాసాలు సెప్టెంబర్ 1–14, 2025 మధ్య మేఘాలయాలోని ఉమ్రోయ్ లో జరగనున్నాయి. 6 / 24 టోల్ ప్లాజా కార్మికుల కుటుంబాల విద్యకు మద్దతు ఇవ్వడానికి NHAI ప్రారంభించిన పథకం ఏది? A) ప్రాజెక్ట్ విద్య B) ప్రాజెక్ట్ ఆరోహణ్ C) ప్రాజెక్ట్ శక్తి D) ప్రాజెక్ట్ దీపం NHAI టోల్ ప్లాజా కార్మికుల కుటుంబాల విద్య కోసం "ప్రాజెక్ట్ ఆరోహణ్"ను ప్రవేశపెట్టింది. 7 / 24 కామన్వెల్త్ గేమ్స్ 2030లో ఎన్ని దేశాలు పాల్గొననున్నాయి? A) 54 B) 62 C) 72 D) 82 కామన్వెల్త్ గేమ్స్‌లో 72 దేశాలు పాల్గొంటాయి. 8 / 24 ఎయిర్ బస్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? A) న్యూయార్క్ B) టూలూజ్, ఫ్రాన్స్ C) లండన్ D) సింగపూర్ Airbus ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని టూలూజ్లో ఉంది. 9 / 24 NATO ఎప్పుడు స్థాపించబడింది? A) 1939 B) 1945 C) 1949 D) 1955 NATO (North Atlantic Treaty Organisation) 1949లో స్థాపించబడింది. 10 / 24 భారత్ కామన్వెల్త్ గేమ్స్‌ను గతంలో ఎప్పుడు నిర్వహించింది? A) 2006 B) 2010 C) 2014 D) 2018 భారత్ 2010లో న్యూఢిల్లీ లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించింది. 11 / 24 19వ ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరిగింది? A) టోక్యో B) పారిస్ C) విన్నిపెగ్, కెనడా D) సియోల్ ఈ ఛాంపియన్షిప్ కెనడాలోని విన్నిపెగ్‌లో 2025 ఆగస్టు 17–24 వరకు జరిగింది. 12 / 24 కామన్వెల్త్ గేమ్స్ మొదట్లో ఏ పేరుతో పిలిచేవారు? A) బ్రిటీష్ ఎంపైర్ గేమ్స్ B) బ్రిటీష్ కామన్వెల్త్ కప్ C) కింగ్స్ గేమ్స్ D) రాయల్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభంలో "బ్రిటీష్ ఎంపైర్ గేమ్స్" గా పిలిచేవారు. 13 / 24 ప్రాజెక్ట్ ఆరోహణ్ పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి? A) వైద్య సేవలు అందించడం B) ఆర్థిక అడ్డంకులు తొలగించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం C) రోడ్డు నిర్మాణం వేగవంతం చేయడం D) రక్షణ రంగంలో సహకారం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు సమాన విద్యావకాశాలు కల్పించడం. 14 / 24 NATO తన కొత్త లాజిస్టిక్స్ ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నది? A) బ్రెసెల్స్ B) ఎన్కోపింగ్ (స్వీడన్) c) స్టాక్ హోం D) ఒస్లో స్వీడన్ రాజధాని స్టాక్ హోం కు వాయువ్యంగా ఉన్న ఎన్కోపింగ్ పట్టణంలో NATO లాజిస్టిక్స్ హెడ్‌క్వార్టర్స్‌ను 2027 నాటికి ఏర్పాటు చేయనుంది. 15 / 24 Secession of the Successful: The Flight out of New India" అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? A) రఘురామ్ రాజన్ B) సంజయ్ బారు C) మోన్టెక్ సింగ్ అహ్లువాలియా D) అమర్త్య సేన్ ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత సంజయ్ బారు రచించారు. “Secession of the Successful” పుస్తకం ప్రధానంగా భారతదేశంలో విజయవంతుల వలస, సామాజిక–ఆర్థిక విభజన, అంశంపై దృష్టి సారించింది 16 / 24 స్వీడన్ ఏ సంవత్సరంలో NATOలో 32వ సభ్యదేశంగా చేరింది? A) 2022 B) 2023 C) 2024 D) 2025 స్వీడన్ 2024లో NATOలో 32వ సభ్యదేశంగా చేరింది. 17 / 24 భారత్ బిడ్ దక్కించుకుంటే కామన్వెల్త్ గేమ్స్ 2030 ఎక్కడ జరగనున్నాయి? A) న్యూఢిల్లీ B) అహ్మదాబాద్ C) ముంబై D) బెంగళూరు బిడ్ భారత్‌కి వస్తే ఈ గేమ్స్ గుజరాత్‌లోని అహ్మదాబాద్, నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నాయి. 18 / 24 19వ ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ 2025లో ఎక్కువ పతకాలు గెలిచిన దేశం ఏది? A) భారత్ B) అమెరికా C) దక్షిణ కొరియా D) జపాన్ దక్షిణ కొరియా మొత్తం 17 పతకాలు గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. భారత్ ఈ టోర్నమెంట్లో 3 స్వర్ణ పతకాలు సాధించింది. 19 / 24 BRICS బ్యాంక్ (NDB) ఏ సంవత్సరంలో స్థాపించబడింది? A) 2012 B) 2014 C) 2016 D) 2018 NDB, BRICS దేశాలచే 2014లో స్థాపించబడింది. 20 / 24 NATO యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? A) లండన్ B) న్యూయార్క్ C) బ్రెసెల్స్ (బెల్జియం) D) పారిస్ NATO ప్రధాన కార్యాలయం బ్రెసెల్స్, బెల్జియంలో ఉంది. 21 / 24 ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ఎప్పటివరకు పొడిగించారు? A) మార్చి 31, 2027 B) మార్చి 31, 2028 C) మార్చి 31, 2030 D) మార్చి 31, 2032 కేంద్ర కేబినెట్ 2025 ఆగస్టు 27న PM SVANidhi పథకాన్ని 2030 మార్చి వరకు పొడిగించింది. కోవిడ్-19 సమయంలో వీధి వ్యాపారులకు సహాయం అందించడానికి ఈ పథకం జూన్ 1, 2020న ప్రారంభించారు. 22 / 24 ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలోని జలాలాబాద్ పట్టణానికి కొత్త పేరు ఏమిటి? A) అయోధ్య B) పరశురామపురి C) ప్రయాగరాజ్ D) దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నగర్ జలాలాబాద్ పట్టణం పేరు పరశురామపురిగా మార్చేందుకు కేంద్ర హోంమంత్రి ఆమోదం తెలిపారు. జలాలాబాద్ (ప్రస్తుతం పరశురామపురి) పరశురాముడి జన్మస్థలం అని భావిస్తారు. 23 / 24 భారత్–థాయ్‌లాండ్ ఉమ్మడి సైనిక విన్యాసాలు “మైత్రి” మొదటిసారి ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? A) 2004 B) 2005 C) 2006 D) 2007 మైత్రి సైనిక విన్యాసాలు భారత్–థాయ్‌లాండ్ మధ్య 2006లో మొదలయ్యాయి. 24 / 24 భారత్–దక్షిణాఫ్రికా JWG 5వ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? A) రక్షణ సహకారం B) వ్యవసాయ సహకారం C) వాణిజ్యం పెంపు D) విద్యా సహకారం ఈ సమావేశం వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా జరిగింది. భారత్–దక్షిణాఫ్రికా JWG 5వ సమావేశం వర్చువల్‌గా జరిగింది. వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ అజిత్ కుమార్ సాహు ఈ సమావేశంలో పాల్గొన్నారు. Your score isThe average score is 55% 0% Restart quiz Telegram Group Join Now WhatsApp Group Join Now Instagram Page Follow Me