ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 2025-27 రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP – Clerk / Customer Service Associate – XV) కింద మొత్తం 10,277 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగం పొందాలనుకునే యువతకు ఇది అద్భుతమైన అవకాశం.
ముఖ్యమైన వివరాలు:
పోస్టు పేరు : కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA)
మొత్తం ఖాళీలు : 10,277
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ + కంప్యూటర్ పరిజ్ఞానం
స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడడం తప్పనిసరి.
వయోపరిమితి:
20 – 28 ఏళ్లు (2025 ఆగస్టు 1 నాటికి)
OBC: +3 ఏళ్లు
C/ST: +5 ఏళ్లు
PwBD: +10 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది.
జీతం:
₹24,050 – ₹64,480 ప్రతినెల.
రాష్ట్రాల వారీగా ఖాళీలు (కొన్ని ముఖ్యమైనవి):
తెలంగాణ – 261
ఆంధ్రప్రదేశ్ – 367
కర్ణాటక – 1170
మహారాష్ట్ర – 1117
తమిళనాడు – 894
ఉత్తరప్రదేశ్ – 1315
పశ్చిమబెంగాల్ – 540
గుజరాత్ – 753
(పూర్తి జాబితా నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంది).
ఎంపిక విధానం:
1. ప్రిలిమినరీ పరీక్ష (ఆన్‌లైన్)
2. మెయిన్స్ పరీక్ష
3. స్థానిక భాష పరీక్ష
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2025 ఆగస్టు 1
చివరి తేదీ: 2025 ఆగస్టు 21
అడ్మిట్ కార్డులు: సెప్టెంబర్ 2025
ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబర్ 2025
మెయిన్స్ పరీక్ష: నవంబర్ 2025
ఫలితాలు: మార్చి 2026
అప్లికేషన్ ఫీజు :
SC/ST/PwBD/ExSM: ₹175
ఇతరులు: ₹850
పూర్తి వివరాల కొరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ కొరకు వెబ్‌సైట్‌లో చూడండి.
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ కల కలగంటున్న అభ్యర్థులు ఈ అవకాశం మిస్సవ్వకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ IBPS అధికారిక వెబ్సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.