
బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన కెరీర్ కోసం ఎదురుచూస్తున్న యువతకు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) శుభవార్త చెప్పింది. అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-A) పోస్టుల భర్తీకి 2026-27 సంవత్సరానికి గాను అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు బ్యాంకింగ్ రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు
ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, పరీక్షా విధానం మరియు దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాలను ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ముఖ్యమైన వివరాలు (Overview):
| సంస్థ పేరు | ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ (IDBI Bank Ltd.) |
|---|---|
| పోస్టు పేరు | అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ‘A’) |
| మొత్తం ఖాళీలు | 200 పోస్టులు |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ ద్వారా (Online Only) |
| అధికారిక వెబ్‌సైట్ | https://www.idbi.bank.in |
ఖాళీల వివరాలు (Vacancy Details):
మొత్తం 200 ఖాళీలను రిజర్వేషన్ల వారీగా ఈ క్రింది విధంగా కేటాయించారు:
| కేటగిరీ | ఖాళీల సంఖ్య |
|---|---|
| అన్‌రిజర్వ్‌డ్ (UR) | 81 |
| ఓబీసీ (OBC) | 54 |
| ఎస్సీ (SC) | 30 |
| ఎస్టీ (ST) | 15 |
| ఈడబ్ల్యూఎస్ (EWS) | 20 |
| మొత్తం | 200 |
అర్హతలు (Eligibility Criteria):
- విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి. కేవలం డిప్లొమా చేసిన వారు అర్హులు కారు.
- పని అనుభవం: షెడ్యూల్డ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/ కోఆపరేటివ్ బ్యాంక్ లేదా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో కనీసం 2 సంవత్సరాల పూర్తి స్థాయి పని అనుభవం ఉండాలి.
- వయోపరిమితి (Age Limit): మార్చి 01, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (అంటే అభ్యర్థి మార్చి 02, 1996 మరియు మార్చి 01, 2005 మధ్య జన్మించి ఉండాలి ).
- వయో సడలింపు: నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (నాన్ క్రీమీలేయర్) అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు (PWD) 10 ఏళ్ల పాటు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
(గమనిక: కొన్ని పత్రికల్లో వయోపరిమితి 20-25 ఏళ్లు అని తప్పుగా ప్రచురితమైంది, అధికారిక నోటిఫికేషన్ ప్రకారం సరైన వయోపరిమితి 21-30 ఏళ్లు)
ముఖ్యమైన తేదీలు (Important Dates):
| ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ | మార్చి 08, 2026 |
|---|---|
| దరఖాస్తుకు చివరి తేదీ | మార్చి 19, 2026 |
| ఆన్‌లైన్ పరీక్ష (Tentative) తేదీ | ఏప్రిల్ 12, 2026 (మధ్యాహ్నం) |

ALSO READ : తెలంగాణ అంగన్‌వాడీ రిక్రూట్‌మెంట్ 2026: 15,274 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్!
దరఖాస్తు ఫీజు (Application Fee):
దరఖాస్తు ఫీజును కేవలం ఆన్‌లైన్ (డెబిట్/క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI) విధానంలో మాత్రమే చెల్లించాలి.
- SC/ST/PWD అభ్యర్థులకు: రూ. 250/- (కేవలం ఇంటిమేషన్ ఛార్జీలు).
- ఇతర అభ్యర్థులకు (UR/OBC/EWS): రూ. 1050/- (అప్లికేషన్ ఫీజు + ఇంటిమేషన్ ఛార్జీలు)
జీతభత్యాలు (Salary & Emoluments):
ఎంపికైన అభ్యర్థులు అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ‘A’) గా విధుల్లో చేరుతారు. వీరికి నెలకు ప్రారంభ బేసిక్ పే రూ. 48,480/- గా ఉంటుంది. దీనికి అదనంగా బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.
ఎంపిక విధానం (Selection Process):
అభ్యర్థులను నాలుగు దశల ద్వారా ఎంపిక చేస్తారు:
- ఆన్‌లైన్ టెస్ట్ (Online Test): 200 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification – DV): సర్టిఫికెట్ల పరిశీలన.
- పర్సనల్ ఇంటర్వ్యూ (Personal Interview): ఆన్‌లైన్ టెస్ట్ లో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
- వైద్య పరీక్షలు (Pre Recruitment Medical Test – PRMT): చివరగా మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుంది.
ఆన్‌లైన్ పరీక్షా విధానం (Exam Pattern):
మొత్తం 200 ప్రశ్నలకు గాను 200 మార్కులకు పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. పరీక్షకు మొత్తం 120 నిమిషాల (2 గంటల) సమయం ఉంటుంది. (ముఖ్య గమనిక: ప్రతి సెక్షన్‌కు విడివిడిగా టైమింగ్స్ ఉంటాయి. పత్రికల్లో సెక్షనల్ టైమింగ్ లేదని తప్పుగా వేశారు).
| సబ్జెక్టు / సెక్షన్ | ప్రశ్నలు | మార్కులు | కేటాయించిన సమయం |
|---|---|---|---|
| లాజికల్ రీజనింగ్ & డేటా అనాలిసిస్ | 60 | 60 | 40 నిమిషాలు |
| ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 40 | 40 | 20 నిమిషాలు |
| క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 40 | 40 | 35 నిమిషాలు |
| జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ & కంప్యూటర్స్ | 60 | 60 | 25 నిమిషాలు |
| మొత్తం | 200 | 200 | 120 నిమిషాలు |
ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply):
- ముందుగా ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్
https://www.idbi.bank.inఓపెన్ చేయాలి. - అందులో “Careers” లేదా “Current Openings” సెక్షన్‌కి వెళ్లి “Recruitment of Assistant Manager – Grade ‘A’ (2 year experience): 2026-27” లింక్ పైన క్లిక్ చేయాలి.
- “Click here for New Registration” పైన క్లిక్ చేసి మీ ప్రాథమిక వివరాలతో రిజిస్టర్ అవ్వాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, మీ రిజిస్టర్డ్ ఈమెయిల్‌కి వచ్చిన ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యి దరఖాస్తు ఫారాన్ని పూర్తిగా నింపాలి.
- నిర్దేశించిన సైజులో మీ ఫోటో, సంతకం, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మరియు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్‌ను అప్‌లోడ్ చేయాలి.
- చివరగా మీ కేటగిరీకి తగినట్లుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకుని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన లింక్స్ (Important Links):
| వివరాలు | లింక్స్ |
|---|---|
| అధికారిక నోటిఫికేషన్ (Official PDF) | Download PDF |
| ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ (Apply Online) | Click Here |
| IDBI అధికారిక వెబ్‌సైట్ | idbi.bank.in |
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. IDBI అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి? అభ్యర్థులు మార్చి 08, 2026 నుంచి మార్చి 19, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
2. ఎంపికైన వారికి జీతం ఎంత ఉంటుంది? నెలకు ప్రారంభ బేసిక్ పే రూ. 48,480/- గా ఉంటుంది.
3. ఐడీబీఐ ఆన్‌లైన్ పరీక్షకు సెక్షనల్ టైమింగ్స్ ఉంటాయా? అవును. మొత్తం 120 నిమిషాల సమయం ఉన్నప్పటికీ, ప్రతి సెక్షన్‌కు విడివిడిగా నిర్దేశించిన సమయం ఉంటుంది.
4. ఎటువంటి పని అనుభవం లేని ఫ్రెషర్స్ అప్లై చేయవచ్చా? లేదు. ఈ పోస్టులకు తప్పనిసరిగా ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్‌లో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.