LIC AE, AAO నియామకాలు – ఇప్పుడే అప్లై చేయండి.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సంస్థలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్ (AE), అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

మొత్తం ఖాళీలు: 491

అసిస్టెంట్ ఇంజినీర్ (AE): 81 పోస్టులు.

అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO): 410 పోస్టులు.

అర్హతలు:

పోస్టు ప్రకారం డిగ్రీ / బి.టెక్ / బి.ఇ / ఎల్ఎల్బీ / సీఏ / ఐసీడబ్ల్యూఏ / సిఎస్ వంటి అర్హత ఉండాలి.

కొన్ని పోస్టులకు సంబంధిత పని అనుభవం అవసరం.

వయోపరిమితి:

 కనిష్టం: 21 ఏళ్లు

గరిష్టం: 30 ఏళ్లు

రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 16, 2025

చివరి తేదీ: సెప్టెంబర్ 9, 2025

ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబర్ 10, 2025

మెయిన్ పరీక్ష: నవంబర్ 8, 2025.

అప్లికేషన్ ఫీజు ఎంత?:

SC / ST / PwBD అభ్యర్థులకు: ₹85

ఇతరులకు: ₹ 700

ఎంపిక విధానం:

ప్రిలిమినరీ పరీక్ష

మెయిన్ పరీక్ష

ఇంటర్వ్యూ

మెడికల్ పరీక్ష

ఎలా అప్లై చేయాలి?

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మరింత సమాచారం కొరకు వెబ్‌సైట్‌ని చూడండి

అధికారిక వెబ్‌సైట్: https://licindia.in

Leave a Comment