నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేసే ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) పాట్నా నుండి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ (12th Class) పాస్ అయిన అభ్యర్థుల కోసం పర్మినెంట్ ప్రాతిపదికన ‘జూనియర్ అసిస్టెంట్’ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఎటువంటి అనుభవం (Experience) లేకపోయినా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు కాంపిటీషన్ తక్కువగా ఉండే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, వయోపరిమితి మరియు అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ తెలుసుకుందాం.

ముఖ్యమైన హైలైట్స్ (Overview) :
| వివరాలు | సమాచారం |
|---|---|
| సంస్థ పేరు | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా (NIT Patna) |
| అడ్వర్టైజ్మెంట్ నెంబర్ | NITP/Non-Teaching/05/2026 |
| పోస్టు పేరు | జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant) – గ్రూప్ C |
| మొత్తం ఖాళీలు | 12 |
| దరఖాస్తు విధానం | ఆన్లైన్ మరియు స్పీడ్ పోస్ట్ |
| అఫీషియల్ వెబ్సైట్ | www.nitp.ac.in |
ఖాళీల వివరాలు (Vacancy Details):
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 జూనియర్ అసిస్టెంట్ (గ్రూప్-సి) పోస్టులను భర్తీ చేయనున్నారు. కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి:
- అన్-రిజర్వ్డ్ (UR): 08 పోస్టులు
- ఓబీసీ (OBC-NCL): 02 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ (EWS): 01 పోస్టు
- ఎస్సీ (SC): 01 పోస్టు
(గమనిక: ఎస్టీ (ST) కేటగిరీకి ప్రత్యేకంగా పోస్టులు లేనప్పటికీ, వారు జనరల్ (UR) కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవచ్చు.)
విద్యా అర్హతలు (Educational Qualifications):
ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి:
- గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ (10+2 / ఇంటర్మీడియట్) పాస్ అయి ఉండాలి.
- ఇంగ్లీష్ లో నిమిషానికి కనీసం 35 పదాలు (35 w.p.m) టైప్ చేయగల స్కిల్ ఉండాలి.
- కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ మరియు స్ప్రెడ్ షీట్ (MS Word, Excel) వినియోగంలో ప్రావీణ్యం ఉండాలి.
- టాలీ, అకౌంటింగ్ నాలెడ్జ్, లేదా స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉన్నవారికి ప్రాధాన్యత (Desirable) ఉంటుంది, కానీ తప్పనిసరి కాదు.
ALSO READ : శ్రీ సరస్వతీ విద్యాపీఠం, తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ – 2026 (భారీ వేతనంతో..)

వయోపరిమితి (Age Limit):
అభ్యర్థుల వయస్సు దరఖాస్తుకు చివరి తేదీ (24 మార్చి 2026) నాటికి లెక్కించబడుతుంది.
- డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు.
- వయో సడలింపులు (Age Relaxation): * SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు.
- OBC (NCL) అభ్యర్థులకు 3 సంవత్సరాలు.
- PwD (జనరల్) అభ్యర్థులకు 10 సంవత్సరాలు
జీతం (Salary Details):
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే బ్యాండ్-1 (PB-1) క్రింద రూ. 5200 – 20200/- స్కేల్ మరియు రూ. 2000/- గ్రేడ్ పే వర్తిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం DA, HRA ఇతర అలవెన్సులు అన్నీ కలుపుకుని ప్రారంభంలోనే దాదాపు రూ. 45,000/- పైగా వేతనం అందుకునే అవకాశం ఉంటుంది
ఎంపిక విధానం (Selection Process):
ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండానే ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఇన్స్టిట్యూట్ వారు నిర్ణయించిన దశల్లో ఎంపిక ఉంటుంది:
- దశ 1: మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ (MCQ) మరియు డిస్క్రిప్టివ్ టెస్ట్ (స్క్రీనింగ్ టెస్ట్).
- దశ 2: ట్రేడ్ టెస్ట్ / స్కిల్ టెస్ట్ (టైపింగ్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్). షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్సైట్ (www.nitp.ac.in) లో పొందుపరుస్తారు
ALSO READ: తెలంగాణ అంగన్‌వాడీ రిక్రూట్‌మెంట్ 2026: 15,274 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్!
అప్లికేషన్ ఫీజు (Application Fee):
అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
| కేటగిరీ | అప్లికేషన్ ఫీజు |
|---|---|
| UR / EWS / OBC(NCL) | రూ. 800.00 |
| SC / ST | రూ. 400.00 |
| PwD అభ్యర్థులకు | ఫీజు లేదు (మినహాయింపు) |
ముఖ్యమైన తేదీలు (Important Dates) :
| వివరం | తేదీ |
|---|---|
| ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ | 03 మార్చి 2026 |
| ఆన్లైన్ అప్లికేషన్ & ఫీజు చెల్లింపుకు చివరి తేదీ | 24 మార్చి 2026, సాయంత్రం 5:00 లోపు |
| హార్డ్ కాపీ (ప్రింట్ అవుట్) పంపడానికి చివరి తేదీ | 30 మార్చి 2026, సాయంత్రం 5:00 లోపు |
ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply):
అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయడంతో పాటు, అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ అవుట్ తీసి పోస్ట్ ద్వారా కూడా పంపించడం తప్పనిసరి.
- ఆన్లైన్ అప్లికేషన్: ముందుగా అధికారిక వెబ్సైట్ www.nitp.ac.in ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ (USER ID, Password) చేసుకోవాలి.
- ఫారమ్ లో మీ వ్యక్తిగత, విద్యా వివరాలు తప్పులు లేకుండా ఫిల్ చేసి, ఫీజు చెల్లించి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- హార్డ్ కాపీ పంపడం: సబ్మిట్ చేసిన అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ తీసుకోండి.
- దానికి మీ 10వ తరగతి, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోలు, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికెట్ (వర్తిస్తే) జిరాక్స్ కాపీలను జత చేసి వాటిపై మీ సంతకం (Self-attested) చేయాలి.
- వీటన్నింటినీ ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టి, కవర్ పైన “Application for the post of Junior Assistant” అని రాసి, ఈ క్రింది అడ్రెస్ కు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా 30 మార్చి 2026 లోపు చేరేలా పంపాలి
పంపాల్సిన చిరునామా:
The Registrar, National Institute of Technology Patna, Ashok Rajpath, Patna – 800 005
| ముఖ్యమైన లింకులు (Important Links) | క్లిక్ చేయండి |
|---|---|
| అఫీషియల్ నోటిఫికేషన్ PDF | Download PDF |
| ఆన్లైన్ లో అప్లై చేయడానికి | Apply Online |
| అధికారిక వెబ్సైట్ (NIT Patna) | Official Website |
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ):
1. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్లు అప్లై చేయొచ్చా?
అవును, ఇండియన్ నేషనల్స్ ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి ఆల్ ఇండియా లెవెల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
2. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఎక్స్పీరియన్స్ అవసరమా?
లేదండీ, ఈ పోస్టులకు కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి, టైపింగ్ స్కిల్స్ (35 wpm) ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు.
3. ఆఫ్ లైన్ లో అప్లై చేయాలా? ఆన్లైన్ లో అప్లై చేయాలా?
రెండూ చేయాలి. ముందుగా వెబ్సైట్ లో 24 మార్చి 2026 లోపు ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత ప్రింట్ అవుట్ తీసుకుని, సర్టిఫికెట్స్ జత చేసి 30 మార్చి 2026 లోపు స్పీడ్ పోస్ట్ ద్వారా పాట్నా కు పంపాలి.
4. ఇందులో సెలెక్షన్ ఎలా ఉంటుంది? ఇంటర్వ్యూ ఉంటుందా?
గ్రూప్-సి ఉద్యోగాలకు ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. కేవలం రాతపరీక్ష (MCQ & డిస్క్రిప్టివ్) మరియు కంప్యూటర్ టైపింగ్ (స్కిల్) టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు