దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త! రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 22,195 గ్రూప్-డి (Level-1) పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం 10వ తరగతి లేదా ITI అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే అద్భుత అవకాశం ఇది. సికింద్రాబాద్ (South Central Railway) జోన్ పరిధిలో కూడా భారీగా ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాలు, అర్హతలు, మరియు అప్లికేషన్ విధానం కింద చూడండి.

Recruitment Overview (ముఖ్యమైన వివరాలు):
| అంశం | వివరాలు |
| సంస్థ పేరు | రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) |
| ఉద్యోగం పేరు | గ్రూప్-డి (Level-1 Posts) |
| మొత్తం ఖాళీలు | 22,195 |
| అర్హత | 10th Pass / ITI / NAC |
| అప్లికేషన్ ప్రారంభం | జనవరి 31, 2026 |
| చివరి తేదీ | మార్చి 02, 2026 |
| ఎంపిక విధానం | CBT, PET, DV, Medical |
| అధికారిక వెబ్‌సైట్ | www.rrbapply.gov.in |
Secunderabad Zone Vacancies (సికింద్రాబాద్ జోన్ ఖాళీలు):
| పోస్టు పేరు | ఖాళీలు |
| ట్రాక్ మెయింటైనర్-IV | 653 |
| పాయింట్స్ మన్ బి | 128 |
| అసిస్టెంట్ (S&T) | 75 |
| అసిస్టెంట్ పి.వే | 39 |
| అసిస్టెంట్ టీఆర్ డీ | 35 |
| అసిస్టెంట్ ట్రాక్ మెషీన్ | 29 |
| అసిస్టెంట్ క్యారేజ్ & వ్యాగన్ | 22 |
| అసిస్టెంట్ టీఎల్ & ఏసీ | 20 |
| అసిస్టెంట్ ఆపరేషన్స్ | 10 |
| అసిస్టెంట్ బ్రిడ్జి | 01 |
(Note: మిగతా జోన్ల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు)
Eligibility Criteria (అర్హతలు):
1. విద్యా అర్హత:
- గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (SSC/Matriculation) ఉత్తీర్ణత లేదా
- సంబంధిత ట్రేడ్ లో ITI (NCVT/SCVT) సర్టిఫికేట్ లేదా
- National Apprenticeship Certificate (NAC) కలిగి ఉండాలి.
- ముఖ్య గమనిక: ITI కి బదులుగా డిప్లొమా (Diploma) లేదా ఇంజనీరింగ్ డిగ్రీ (B.Tech) చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు కారు.
2. వయో పరిమితి (Age Limit):
- కనీస వయస్సు: 18 ఏళ్లు
- గరిష్ట వయస్సు: 33 ఏళ్లు
- వయో సడలింపు:
- OBC: 3 ఏళ్లు
- SC/ST: 5 ఏళ్లు
- PwBD: 10 ఏళ్లు

Selection Process & Exam Pattern (ఎంపిక విధానం):
అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
CBT Exam Pattern:
- సమయం: 90 నిమిషాలు
- మొత్తం ప్రశ్నలు: 100 (మల్టిపుల్ చాయిస్)
- నెగెటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.
| సబ్జెక్ట్ (Subject) | ప్రశ్నలు | మార్కులు |
| జనరల్ సైన్స్ | 25 | 25 |
| మ్యాథమెటిక్స్ | 25 | 25 |
| జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ | 30 | 30 |
| జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్ | 20 | 20 |
| మొత్తం | 100 | 100 |
Application Fee (దరఖాస్తు రుసుము):
- General / OBC / EWS: రూ. 500/- (పరీక్ష రాస్తే రూ. 400 రీఫండ్ అవుతుంది)
- SC / ST / Ex-Servicemen / PwBD / Female / Minorities / EBC: రూ. 250/- (పరీక్ష రాస్తే మొత్తం రీఫండ్ అవుతుంది).
Important Links
- Apply Online: Click Here to Apply
- Download Notification PDF: Click Here
- Join Our Telegram Group: Join Here