TGPSC Degree Lecturer Recruitment: డిగ్రీ కాలేజీ పోస్టుల భర్తీకి కొత్త రూల్స్, 50-40-10 ఫార్ములా పూర్తి వివరాలు

TGPSC Degree Lecturer Recruitment New Rules

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు (డిగ్రీ లెక్చరర్లు – DL), లైబ్రేరియన్లు, మరియు ఫిజికల్ డైరెక్టర్ (PD) పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో ఉన్న గందరగోళాలకు, కోర్టు కేసులకు తావులేకుండా ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మార్చింది.

ఈ నియామకాలన్నీ TGPSC (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ద్వారా, యూజీసీ (UGC – 2018) నిబంధనలకు అనుగుణంగా జరగనున్నాయి. ఈ కొత్త 50-40-10 రూల్ గురించి మన మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ అందిస్తున్న పూర్తి వివరాలు మీకోసం.

కొత్త ఎంపిక ప్రక్రియ (The 50-40-10 Rule):

గతంలో ఈ పోస్టులకు కేవలం రాత పరీక్ష ద్వారానే వంద శాతం మార్కులు కేటాయించి ఎంపిక చేసేవారు. కానీ తాజా విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం, ఎంపిక ప్రక్రియను మొత్తం 100 మార్కులకు లెక్కగట్టి, మూడు భాగాలుగా విభజించారు:

ఎంపిక దశ (Selection Stage) కేటాయించిన వెయిటేజీ
1. అకడమిక్ స్కోర్ (గత విద్యా రికార్డులు) గరిష్టంగా 50%
2. రాత పరీక్ష (సబ్జెక్టు నైపుణ్యం) 40%
3. పర్సనల్ ఇంటర్వ్యూ 10%

1. అకడమిక్ స్కోర్ లెక్కింపు విధానం (UGC 2018 Table 3B):

అకడమిక్ స్కోర్ కు గరిష్టంగా 50 మార్కులు ఉంటాయి. అభ్యర్థి డిగ్రీ స్థాయి నుండి సాధించిన మార్కుల ఆధారంగా UGC 2018 నిబంధనల ప్రకారం (Table 3B) ఈ స్కోర్‌ను లెక్కిస్తారు.

UGC 2018 Appendix II Table 3B Academic Score
UGC 2018 Appendix II Table 3B Academic Score

ALso Read : 10వ తరగతి అర్హతతో తెలంగాణలో 10,909 వాలంటీర్ల ఉద్యోగాలు : https://mastertveducation.com/telangana-digital-crop-survey-jobs-2026-apply-offline/

విద్యార్హత స్కోర్ లెక్కింపు
డిగ్రీ (Graduation) 80% పైన = 21, 60%-80% = 19, 55%-60% = 16, 45%-55% = 10 మార్కులు
పీజీ (PG) 80% పైన = 25, 60%-80% = 23, 55%-60% (SC/ST/OBC) = 20 మార్కులు
Ph.D. / M.Phil Ph.D. కి నేరుగా 25 మార్కులు. (M.Phil 60% పైన ఉంటే 7 మార్కులు)
NET/SET NET (JRF) = 10, NET = 08, SLET/SET = 05 మార్కులు

2. రాత పరీక్ష విధానం & క్వాలిఫైయింగ్ మార్కులు:

సబ్జెక్టు నైపుణ్యాన్ని పరీక్షించేందుకు TGPSC నిర్వహించే రాత పరీక్షకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇందులో మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష రాయడానికి 2.5 గంటల సమయం ఇస్తారు. ఈ పరీక్షలో క్వాలిఫై కావాలంటే కింది విధంగా కనీస మార్కులు సాధించాలి:

  • OC, EWS అభ్యర్థులకు: 40%
  • BC అభ్యర్థులకు: 35%
  • SC, ST, దివ్యాంగులకు: 30%

3. ఇంటర్వ్యూకి ఎంపిక (1:5 నిష్పత్తిలో):

రాత పరీక్షలో అభ్యర్థి సాధించిన మార్కులు (40% వెయిటేజీ), మరియు అకడమిక్ స్కోర్ (50% వెయిటేజీ) రెండింటినీ కలిపి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. దీని ఆధారంగా ప్రతి కేటగిరీలో ఒక్కో పోస్టుకు ఐదుగురు అభ్యర్థులను (1:5 నిష్పత్తిలో) ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. TGPSC చైర్మన్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఇంటర్వ్యూకి 10 మార్కులు ఉంటాయి.

TGPSC ఖాళీల వివరాలు (Notification No. 33/2022):

TGPSC విడుదల చేసిన తాజా వెబ్ నోట్ ప్రకారం, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులు మొత్తం 544 ఖాళీలు ఉన్నాయి.

TGPSC Assistant Professor Vacancies List 2026
TGPSC Assistant Professor Vacancies List 2026
సబ్జెక్టు / కేటగిరీ మొత్తం పోస్టులు
Computer Science 311
Business Administration 39
Telugu (తెలుగు) 27
English (ఇంగ్లీష్) 23
Physical Director (PD) 29
Librarian 24
Grand Total 544

డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వీడియో ఇక్కడ చూడగలరు : https://youtu.be/Ln0d9ovf4hE

TGPSC Degree Lecturer Recruitment – తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ప్రశ్న 1: TGPSC డిగ్రీ కాలేజీ పోస్టుల ఎంపిక విధానం ఎలా ఉంటుంది?

జవాబు: కొత్త నిబంధనల ప్రకారం ఎంపిక మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. ఇందులో అభ్యర్థి అకడమిక్ స్కోర్‌కు 50% వెయిటేజీ, TGPSC నిర్వహించే రాత పరీక్షకు 40% వెయిటేజీ, మరియు ఇంటర్వ్యూకు 10% వెయిటేజీ ఇస్తారు.

ప్రశ్న 2: అకడమిక్ స్కోర్ (Academic Score) లో 10వ తరగతి, ఇంటర్ మార్కులు కలుపుతారా?

జవాబు: లేదు. UGC 2018 నిబంధనల ప్రకారం అకడమిక్ స్కోర్ లెక్కింపులో 10వ తరగతి (SSC), ఇంటర్మీడియట్ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. ఈ స్కోర్ లెక్కింపు కేవలం డిగ్రీ స్థాయి నుండి మొదలవుతుంది (డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, NET/SET, టీచింగ్ అనుభవం తదితరవి).

ప్రశ్న 3: ఓపెన్ డిగ్రీ (Open Degree) లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో పీజీ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులేనా? వారికి అకడమిక్ స్కోర్ ఇస్తారా?

జవాబు: కచ్చితంగా అర్హులే! UGC (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) గుర్తింపు పొందిన ఏ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా పీజీ చేసినా, అది రెగ్యులర్ విద్యతో సమానమే. కాబట్టి ఓపెన్ డిగ్రీ/డిస్టెన్స్ పీజీ చేసిన అభ్యర్థులకు కూడా వారి మార్కుల శాతం ఆధారంగా అకడమిక్ స్కోర్ లెక్కిస్తారు.

ప్రశ్న 4: రాత పరీక్షలో క్వాలిఫై కావాలంటే కనీసం ఎన్ని మార్కులు రావాలి?

జవాబు: TGPSC నిర్వహించే 150 మార్కుల రాత పరీక్షలో.. OC మరియు EWS అభ్యర్థులకు 40 శాతం, BC అభ్యర్థులకు 35 శాతం, అలాగే SC, ST, దివ్యాంగులకు 30 శాతం కనీస మార్కులు వస్తేనే వారు క్వాలిఫై అయినట్లు.

ప్రశ్న 5: ఇంటర్వ్యూకి ఎంత మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు?

జవాబు: రాత పరీక్ష మరియు అకడమిక్ స్కోర్ మార్కులను కలిపి తయారు చేసిన మెరిట్ లిస్ట్ ఆధారంగా.. ఒక్కో పోస్టుకు ఐదుగురిని అంటే 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.

ప్రశ్న 6: TGPSC ద్వారా భర్తీ చేయనున్న మొత్తం డిగ్రీ కాలేజీ పోస్టులు ఎన్ని?

జవాబు: నోటిఫికేషన్ నెం. 33/2022 ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లైబ్రేరియన్లు మరియు పీడీ పోస్టులు కలిపి మొత్తం 544 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

Leave a Comment