TGPSC OTR Edit Process 2026: వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఎలా అప్డేట్ చేసుకోవాలి? (పూర్తి వివరాలు)

ఈ ఆర్టికల్ లో OTR ను ఎలా ఎడిట్ చేయాలి? ఏయే డాక్యుమెంట్స్ కావాలి? అనే విషయాలను స్టెప్ బై స్టెప్ క్లియర్ గా తెలుసుకుందాం.

1. TGPSC OTR ఎడిట్ కి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్:

ఎడిట్ ప్రాసెస్ మొదలుపెట్టే ముందు ఈ క్రింది సర్టిఫికెట్స్ స్కాన్ చేసి పెట్టుకోండి (Size: 40KB – 500KB, Format: JPG/JPEG):

  • ఆధార్ కార్డు
  • SSC (10వ తరగతి) మెమో
  • 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు బోనఫైడ్ (Bonafide) సర్టిఫికెట్స్
  • కమ్యూనిటీ సర్టిఫికెట్ (Caste Certificate)
  • SC అభ్యర్థులకు: వర్గీకరణ (ABCD) వివరాలతో కూడిన కొత్త క్యాస్ట్ సర్టిఫికెట్ (మీ సేవ నుండి తీసుకున్నది).
  • నాన్-క్రిమి లేయర్ (BC అభ్యర్థులకు) & EWS సర్టిఫికెట్ (అవసరమైతే).
  • డిగ్రీ, పీజీ ఇతర క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్.
  • పాస్పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకం (Signature).

2. TGPSC ID మార్పు (TS to TG):

  • గతంలో మన OTR ఐడి TS’ తో మొదలయ్యేది (ఉదా: TS123456). కానీ ప్రభుత్వం మారిన తర్వాత దానిని ‘TG’ గా మార్చడం జరిగింది.
  • మీరు లాగిన్ అయ్యేటప్పుడు పాత ఐడిలోని TS ప్లేస్ లో TG అని టైప్ చేసి, మీ డేట్ అఫ్ బర్త్ మరియు క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.

3. Step-by-Step OTR Edit Process:

  • Step 1: Basic Details (ప్రాథమిక వివరాలు)

లాగిన్ అయ్యాక ‘Edit OTR’ ఆప్షన్ ఎంచుకోండి. మొదట ఆధార్ వివరాలు సరిచూసుకోండి. మీ పేరు, జెండర్, డేట్ అఫ్ బర్త్ వంటి వివరాలు పదవ తరగతి మెమో ప్రకారం ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇవి సాధారణంగా ఎడిట్ చేయడానికి వీలుండదు.

  • Step 2: SC Categorization Update (అత్యంత ముఖ్యం)

ఎస్సీ (SC) అభ్యర్థులకు వర్గీకరణ జరిగింది కాబట్టి (Group A, B, C, D), మీరు పాత క్యాస్ట్ సర్టిఫికెట్ కాకుండా, మీ సేవలో అప్లై చేసి తీసుకున్న కొత్త సర్టిఫికెట్ నెంబర్ ను మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్పుడే సిస్టమ్ ‘Verified’ అని చూపిస్తుంది.

4. Address Details (చిరునామా):

  • Permanent Address: ఇది ఒక్కసారి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మళ్ళీ మార్చలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవ్వండి.
  • Correspondence Address: దీనిని మీరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు.
  • Mobile Number: నెంబర్ మార్చాలనుకుంటే OTP వెరిఫికేషన్ ద్వారా మార్చుకునే అవకాశం కల్పించారు.

School Study Details (1st to 7th Class):

ఇది చాలా కీలకమైన దశ. మీరు 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ స్కూల్ లో చదివారో ఆ వివరాలు ఎంటర్ చేయాలి. దీని ఆధారంగానే మీ లోకల్ జిల్లా (Local District) నిర్ణయించబడుతుంది.

Step 5: Certificates Upload:

  • వెబ్ నోట్ ప్రకారం కింది సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి:
  • 1-7th Class Bonafide Certificates (ఒకవేళ బోనఫైడ్ లేకపోతే లోకల్ కాండిడేట్ సర్టిఫికెట్).
  • 10th, Inter, Degree, PG సర్టిఫికెట్లు.
  • Caste/Community Certificate.
  • గమనిక: సర్టిఫికెట్స్ అన్నీ Originals స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

 అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు:

  • 1. Non-Editable Fields: పర్మనెంట్ అడ్రస్, బేసిక్ వివరాలు ఒక్కసారి సబ్మిట్ చేశాక మార్చలేము.
  • 2. Editable Fields: EWS, Non-Creamy Layer సర్టిఫికెట్లు ప్రతి ఏటా మారుతాయి కాబట్టి, వాటిని ఎప్పుడైనా అప్డేట్ చేసుకునే వెసులుబాటు ఉంది. అలాగే ఫోటో మరియు సంతకం కూడా మార్చుకోవచ్చు.
  • 3. Submission: కేవలం వివరాలు నింపి వదిలేయకండి. చివరలో ‘Submit’ బటన్ నొక్కితేనే మీ వివరాలు సేవ్ అవుతాయి.

మిత్రులారా, భవిష్యత్తులో వచ్చే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 నోటిఫికేషన్లకు ఈ OTR డేటానే ప్రామాణికం. కాబట్టి ఎలాంటి తప్పులు లేకుండా నిదానంగా, సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకుని అప్డేట్ చేసుకోండి.

(ఈ సమాచారం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది. అధికారిక సమాచారం కోసం దయచేసి TGPSC అధికారిక వెబ్సైట్ ను సందర్శించగలరు.)

మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ ఫుల్ వీడియో లింక్ ఉంది తప్పకుండా చూడండి:

TGPSC OTR EDIT STEP BY STEP PROCESS VIDEO : https://youtu.be/_nLfo80oe_o

TGPSC OTR EDIT WEBSITE LINK : https://otr.tgpsc.gov.in/login?type=edit

Leave a Comment