UPSC EPFO EO/AO/APFC 2025 NOTIFICATION – పూర్తి గైడ్

Hi friends, 👋

మీరు EPFO Executive Officer (EO), Accounts Officer (AO), లేదా Assistant Provident Fund Commissioner (APFC) పోస్టులకు ప్రయత్నించాలనుకుంటున్నారా? అటువంటి వాళ్ల కోసం ఈ పేజ్ లో సులభంగా అర్థమయ్యే విధంగా వివరించాం.

EPFO & UPSC గురించి

EPFO (Employees’ Provident Fund Organisation) – భారత్ లో సామాజిక భద్రతా పథకాలను నిర్వర్తిస్తుంది.

EO/AO/APFC భర్తీ UPSC ద్వారా జరుగుతుంది, అందువల్ల పూర్తి పారదర్శకత మరియు మెరిట్ ప్రాముఖ్యత ఉంటుంది.

మీరు PREFERED ఎగ్జామ్ సెంటర్ Hyderabad వంటివి select చేయవచ్చు.

విద్యా అర్హతలు :

ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ (EO) / అకౌంట్స్ ఆఫీసర్ (AO)

అర్హత: ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఉండాలి

 డిప్లోమా ఉంటే ఫెవరబుల్: Company Law, Labour Laws లేదా Public Administration లో డిప్లోమా ఉన్న అభ్యర్థులు ఈ పోస్ట్‌లలో అధిక ప్రాధాన్యత పొందుతారు.

అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC)

అర్హత : ఏదైనా సబ్జెక్టులో నుండి బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరిగా ఉండాలి

OTHER QUALIFICATIONS:

  MBA , LLB, CA, CS, లేదా Company Secretary/Management/Public Administration లో PG Diploma ఉన్న అభ్యర్థులు పోస్ట్‌లో మాత్రమే కాకుండా ఇంటర్వ్యూలో కూడా ప్రత్యేక గుర్తింపు పొందగలరు

సెలెక్షన్ ప్రాసెస్ (Selection Process)

ఈ recruitment లో ముఖ్యమైన దశలు:

ఎగ్జామ్ / ఆన్‌లైన్ టెస్ట్

   ఎగ్జామ్ విధానం (Exam Mode):

పరీక్ష విధానం: పెన్సిల్ & పేపర్ ఆధారిత Combined Recruitment Test (CRT)

పరీక్ష భాషలు: ఇంగ్లీష్ మరియు హిందీ

పరీక్ష తేదీ: 30 నవంబర్ 2025

పరీక్ష స్థలం: భారతదేశంలోని వివిధ కేంద్రాలు

పరీక్ష సమయం: 2 గంటలు

మార్కులు: మొత్తం 300 మార్కులు

ప్రశ్నల సంఖ్య: 120 ప్రశ్నలు (ప్రతి ప్రశ్నకు 2.5 మార్కులు)

నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు తగ్గించబడతాయి

ఇంటర్వ్యూ / Personality Test:

   Written test లో shortlist అయిన అభ్యర్థులు మాత్రమే

   Communication skills, domain knowledge, problem-solving ability check చేస్తారు

డాక్యుమెంట్ వెరిఫికేషన్:

    విద్యాసర్టిఫికెట్లు, వయసు నిర్ధారణ, caste certificate (అవసరమైతే)

మెడికల్ ఫిట్నెస్ టెస్ట్:

   ఉద్యోగానికి అభ్యర్థి ఆరోగ్యంగా ఉన్నారా అని పరీక్ష

ఫైనల్ అపాయింట్ మెంట్:

   Written + Interview marks ఆధారంగా merit list తయారు చేసి నియామకం చేయడం జరుగుతుంది.

ఎగ్జామ్ కోసం సిలబస్ ఏంటి – ఏమి చదవాలి:

ప్రధాన అంశాలు (EO/AO/APFC కోసం):

General English – Vocabulary, Grammar, Reading Comprehension

Indian Freedom Struggle – ముఖ్యమైన ఘటనలు, ఉద్యమాలు

Current Affairs – జాతీయ, అంతర్జాతీయ, ఆర్గనైజేషన్ రిపోర్ట్స్

Indian Polity & Economy – Constitution, Governance, Budget, Economic Policies

Accounting & Finance Basics – Bookkeeping, Financial Statements

Industrial Relations & Labour Laws – EPFO rules, Labour Reforms

General Science & Computers – Physics, Chemistry, Biology, MS Office, Networking basics

Mental Ability & Quantitative Aptitude – Logical reasoning, Data interpretation, Time & Work, Percentages

Social Security in India – EPFO, ESIC, Maternity Benefit, Gratuity

APFC కోసం అదనపు అంశాలు:

Auditing– Principles, Procedures, Financial Auditing

Statistics – Statistical Methods, Probability, Data Analysis

ప్రిపరేషన్ టిప్స్:

Written Exam – ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది, అందుకే దీని మీద ఎక్కువ focus చేయాలి.

మునుపటి ప్రశ్నపత్రాలు – ప్రశ్నల నమూనా మరియు frequently asked topics తెలుసుకోవడానికి

Interview– Current affairs, labour laws, social security schemes పై సిద్దంగా ఉండాలి

Documents Ready – Shortlisting తరువాత అభ్యర్థులు సర్టిఫికెట్లు రెడీ చేసుకొని సిద్ధంగా ఉండాలి.

వయోపరిమితి వివరాలు:

యూపీఎస్‌సీ EPFO EO/AO (ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్) ఉద్యోగాలకు:

Upper Age Limit (General/EWS) : 30 సంవత్సరాలు

లేకపోతే, Relaxation లతో:

  OBC: +3 సంవత్సరాలు → 33 సంవత్సరాలు

  SC/ST: +5 → 35 సంవత్సరాలు

  EPFO Employees: +5 → 35 సంవత్సరాలు

  PwBD (General): +10 → 40 సంవత్సరాలు

  PwBD (OBC): +13 → 43 సంవత్సరాలు

  PwBD (SC/ST): +15 → 45 సంవత్సరాలు

UPSC EPFO APFC (సహాయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్) పోస్టుకు:

Upper Age Limit (General/EWS): 35 సంవత్సరాలు

Relaxations:

  OBC: +3 → 38 సంవత్సరాలు

  SC/ST: +5 → 40 సంవత్సరాలు

  EPFO Employees: +5 → 40 సంవత్సరాలు

  PwBD (General): +10 → 45 సంవత్సరాలు

  PwBD (OBC): +13 → 48 సంవత్సరాలు

  PwBD (SC/ST): +15 → 50 సంవత్సరాలు

ముఖ్య సూచనలు:

Negative Marking– ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు deduct అవుతాయి

Exam Center – Hyderabad లేదా మీ preferred center select చేయండి

Daily Revision – ప్రతీ సబ్జెక్ట్ ను కవర్ చేయడం అలవాటు చేసుకోండి.

అప్లై చేయడానికి చివరి తేదీ:

18 ఆగస్టు 2025 (సాయంత్రం 6:00 గంటల వరకు)

అప్లికేషన్ ఫీజు:

General/OBC/EWS అభ్యర్థులకు:

 ఒక పోస్టు కోసం: ₹25

 రెండు పోస్టుల కోసం: ₹50

SC/ST/PwBD అభ్యర్థులకు: ఫీజు లేదు

UPSC ద్వారా మాత్రమే చెల్లించాలి (డెబిట్/క్రెడిట్ కార్డ్, UPI లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా)

అప్లై చేయడానికి సూచనలు:

అప్లికేషన్ ఫారమ్: https://upsconline.nic.in

ప్రారంభ తేదీ: 29 జూలై 2025

చివరి తేదీ:18 ఆగస్టు 2025 (సాయంత్రం 6:00 గంటల వరకు)

గమనిక: ఈ తేదీలు మరియు ఫీజులు UPSC అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఉన్నాయి.

విద్యా మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ని ఫాలో అవ్వండి. మీ మిత్రులకు షేర్ చేయండి

Leave a Comment