ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం అనేది చాలా మందికి డ్రీమ్ జాబ్!
ఇప్పుడు ఆ అవకాశం మీ ముందుంది. అస్సలు మిస్ అవ్వకండి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా జూనియర్ అసోసియేట్స్ (Customer Support & Sales) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 6,589 పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్నాయి.
ఎవరెవరు అప్లై చేయొచ్చు?
డిగ్రీ పూర్తిచేసిన వారు
Final year చదువుతున్నవారు కూడా అప్లై చేయొచ్చు (2025 డిసెంబర్ 31 లోపు డిగ్రీ సర్టిఫికేట్ సమర్పించాలి)
వయస్సు పరిమితి :
20 నుంచి 28 సంవత్సరాలు ( 1997 ఏప్రిల్ 2 నుంచి 2005 ఏప్రిల్ ఒకటవ తేదీ లోపు జన్మించి ఉండాలి.
OBC – 3 ఏళ్లు సడలింపు
SC/ST – 5 ఏళ్లు సడలింపు
ఇతర కేటగిరీలకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
దివ్యాంగులకు కేటగిరీలను అనుసరించి 10 నుంచి 15 సంవత్సరాల వయస్సులో సడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు, ఇతరులకు నిబంధనలు అనుసరించి సడలింపు ఉంటుంది.
భాషా ప్రావీణ్యం ఏముండాలి?
మీరు అప్లై చేస్తున్న రాష్ట్ర భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
పది లేదా ఇంటర్‌లో ఆ భాష చదివినట్లు సర్టిఫికేట్ చూపించాలి.
ఎలా అప్లై చేయాలి?
SBI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి: www.sbi.co.in
Recruitment సెక్షన్‌లోకి వెళ్లి , తరువాత.Junior Associates 2025 నోటిఫికేషన్ ఓపెన్ చేయండి.
Online Application ఫారమ్ ఫిల్ చేసి, ఫీజు చెల్లించండి
NOTE: ఈ పోస్టులు దేశవ్యాప్తంగా ఉండటం వల్ల కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సిలబస్ చూసి ఇప్పటినుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి.
అప్లికేషన్ ఫీజు:
General/OBC/EWS – ₹750
SC/ST/PWD – ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు:
చివరి తేదీ: 26 August 2025.
మరిన్ని తాజా జాబ్ అప్డేట్స్ కోసం:
mastertveducation.com ని డైలీగా చెక్ చేయండి.