పోటీ పరీక్షల్లో ( DSC, TSPSC, APPSC) ‘భారత జాతీయ ఉద్యమం’ నుంచి కచ్చితంగా మార్కులు తెచ్చిపెట్టే టాపిక్ “భారత జాతీయ కాంగ్రెస్ (INC) సమావేశాలు”. వందల కొద్దీ తేదీలు, పేర్లు బట్టీ పట్టకుండా సులభంగా గుర్తుంచుకోవడానికి Master TV Education అందిస్తున్న సింగిల్ లైన్ ట్రిక్స్ మరియు పూర్తి వివరాలు మీకోసం.
💡 సింగిల్ లైన్ స్టోరీ ట్రిక్స్ (గుర్తుపెట్టుకునే విధానం)
- ట్రిక్ 1 (మొదటి 4 సమావేశాలు & వాటి ప్రాముఖ్యత – 1885-1888):
- కోడ్: “బకమా (Ba-Ka-Ma-A) లో బే-నౌ-త్యా-యూల్ కలిశారు”
- వివరణ & ముఖ్యమైన పాయింట్లు:
- బ – బే (1885 బొంబాయి – డబ్ల్యూ.సి. బెనర్జీ): మొదటి సమావేశం. 72 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
- క – నౌ (1886 కలకత్తా – దాదాభాయ్ నౌరోజీ): ఈయన కాంగ్రెస్‌కు మొత్తం 3 సార్లు అధ్యక్షత వహించారు.
- మా – త్యా (1887 మద్రాస్ – బద్రుద్దీన్ త్యాబ్జీ): కాంగ్రెస్ యొక్క మొదటి ముస్లిం అధ్యక్షుడు.
- అ – యూల్ (1888 అలహాబాద్ – జార్జ్ యూల్): కాంగ్రెస్ యొక్క మొదటి ఆంగ్లేయ/బ్రిటిష్ అధ్యక్షుడు.
- ట్రిక్ 2 (రెండు పాటలు ఒకే చోట):
- కోడ్: “పాట ఏదైనా స్టేజ్ కలకత్తానే!”
- వివరణ: 1896లో వందేమాతరం పాడినా, 1911లో జనగణమన పాడినా.. ఆ రెండు సమావేశాలు జరిగింది కలకత్తా లోనే.
- ట్రిక్ 3 (అతివాదులు, మితవాదుల విడిపోవడం – కలవడం):
- కోడ్: “1907 సూరత్ లో సురుక్కుమన్నారు (విడిపోయారు), 1916 లక్నో లో లక్ కలిసి వచ్చింది (మళ్ళీ కలిశారు).”
- ట్రిక్ 4 (మహిళా అధ్యక్షులు – +8 ఫార్ములా):
- కోడ్: “1917 + 8 = 1925 + 8 = 1933”
- వివరణ: 1917 (అనిబిసెంట్) కు 8 ఏళ్లు కలిపితే 1925 (సరోజినీ నాయుడు), దానికి 8 ఏళ్లు కలిపితే 1933 (నళినీ సేన్‌గుప్తా).
📖 భారత జాతీయ కాంగ్రెస్ – ముఖ్యమైన సమావేశాలు
తొలి నాటి సమావేశాలు (స్థాపన)
- 1885 బొంబాయి: మొదటి సమావేశం. అధ్యక్షుడు: డబ్ల్యూ.సి. బెనర్జీ. 72 మంది హాజరయ్యారు. దాదాభాయ్ నౌరోజీ సలహాతో ‘భారత జాతీయ కాంగ్రెస్’గా నామకరణం.
- 1886 కలకత్తా: అధ్యక్షుడు: దాదాభాయ్ నౌరోజీ (మొత్తం 3 సార్లు అధ్యక్షుడిగా చేశారు).
- 1887 మద్రాస్: అధ్యక్షుడు: బద్రుద్దీన్ త్యాబ్జీ (కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు).
- 1888 అలహాబాద్: అధ్యక్షుడు: జార్జ్ యూల్ (మొదటి ఆంగ్లేయ/బ్రిటిష్ అధ్యక్షుడు).
జాతీయ గీతాలు పాడిన సమావేశాలు
- 1896 కలకత్తా: అధ్యక్షుడు: రహీంతుల్లా సయానీ. (మొదటిసారిగా ‘వందేమాతరం’ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు).
- 1911 కలకత్తా: అధ్యక్షుడు: బిషన్ నారాయణ దార్. (మొదటిసారిగా ‘జనగణమన’ గీతాన్ని ఆలపించారు).
ఉద్యమాలు – కీలక ఘట్టాలు
- 1905 వారణాసి: అధ్యక్షుడు: గోపాలకృష్ణ గోఖలే. (స్వదేశీ ఉద్యమానికి మద్దతు).
- 1906 కలకత్తా: అధ్యక్షుడు: దాదాభాయ్ నౌరోజీ. (మొదటిసారిగా ‘స్వరాజ్’ పదం వాడకం).
- 1907 సూరత్: అధ్యక్షుడు: రాస్ బిహారీ ఘోష్. (అతివాదులు, మితవాదులుగా కాంగ్రెస్ చీలిక – సూరత్ విచ్ఛిన్నం).
- 1916 లక్నో: అధ్యక్షుడు: అంబికా చరణ్ మజుందార్. (కాంగ్రెస్ – లీగ్ మధ్య లక్నో ఒప్పందం మరియు అతివాదులు, మితవాదుల కలయిక).
- 1920 నాగ్‌పూర్: అధ్యక్షుడు: సి. విజయరాఘవాచారియార్. (సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదం. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు ప్రస్తావన).
మహిళా అధ్యక్షులు
- 1917 కలకత్తా: అనిబిసెంట్ (కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు).
- 1925 కాన్పూర్: సరోజినీ నాయుడు (మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు).
స్వాతంత్ర్యానికి అడుగులు (గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్)
- 1924 బెల్గాం: అధ్యక్షుడు: మహాత్మా గాంధీ (ఆయన అధ్యక్షత వహించిన ఒకే ఒక్క సమావేశం).
- 1929 లాహోర్: అధ్యక్షుడు: జవహర్‌లాల్ నెహ్రూ. (‘పూర్ణ స్వరాజ్’ తీర్మానం. జనవరి 26, 1930న స్వాతంత్ర్య దినోత్సవంగా జరపాలని నిర్ణయం).
- 1931 కరాచీ: అధ్యక్షుడు: వల్లభాయ్ పటేల్. (ప్రాథమిక హక్కుల తీర్మానం ఆమోదం).
- 1937 ఫైజ్‌పూర్: అధ్యక్షుడు: జవహర్‌లాల్ నెహ్రూ. (ఒక గ్రామంలో జరిగిన మొదటి సమావేశం).
- 1938 హరిపుర: అధ్యక్షుడు: సుభాష్ చంద్రబోస్. (జాతీయ ప్రణాళికా సంఘం ఏర్పాటు – దీనికి చైర్మన్ నెహ్రూ).
- 1939 త్రిపురి: అధ్యక్షుడు: సుభాష్ చంద్రబోస్. (గాంధీజీతో విభేదాలతో బోస్ రాజీనామా, రాజేంద్ర ప్రసాద్ కు బాధ్యతలు).
- 1940 రామ్‌గఢ్: అధ్యక్షుడు: అబుల్ కలాం ఆజాద్. (అత్యంత సుదీర్ఘ కాలం 1940-1945 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు).
- 1947 మీరట్: అధ్యక్షుడు: జె. బి. కృపలానీ. (భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఈయనే కాంగ్రెస్ అధ్యక్షుడు).
ALSO READ : AP KGBV Recruitment 2026: 299 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు
1. తెలుగు రాష్ట్రాల ప్రత్యేకం (AP/TS ఎగ్జామ్స్‌లో ఎక్కువగా అడిగేవి):
- 1891 నాగ్‌పూర్ సమావేశం: అధ్యక్షుడు – పి. ఆనందాచార్యులు. (భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడైన తొలి తెలుగు వ్యక్తి).
- 1923 కాకినాడ సమావేశం: అధ్యక్షుడు – మౌలానా మహ్మద్ అలీ. (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మొదటి కాంగ్రెస్ సమావేశం).
- 1939 త్రిపురి సమావేశం (అదనపు పాయింట్): ఈ సమావేశంలో సుభాష్ చంద్రబోస్.. గాంధీజీ బలపరిచిన తెలుగు వ్యక్తి అయిన ‘భోగరాజు పట్టాభి సీతారామయ్య’ పై విజయం సాధించారు. (ఇది పోటీ పరీక్షల్లో చాలాసార్లు అడిగిన బిట్).
2. మరికొన్ని ముఖ్యమైన అదనపు బిట్స్:
- 1923 ఢిల్లీ (ప్రత్యేక సమావేశం): అధ్యక్షుడు – అబుల్ కలాం ఆజాద్. (కాంగ్రెస్ అధ్యక్షుడైన అత్యంత పిన్న వయస్కుడు – Youngest President).
- 1889 బొంబాయి సమావేశం: అధ్యక్షుడు – విలియం వెడ్డర్‌బర్న్. (ఈ సమావేశంలోనే మొదటిసారిగా మహిళలు కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్నారు).
📚 పోటీ పరీక్షల కోసం బెస్ట్ బుక్స:
మీ ప్రిపరేషన్‌ను మరింత పటిష్టం చేసుకోవడానికి టాప్ ఫ్యాకల్టీలు సూచించిన పుస్తకాలు ఇక్కడ కొనుగోలు చేయవచ్చు:
- ఇండియన్ హిస్టరీ (తెలుగు అకాడమీ/ప్రామాణిక పుస్తకం) – ఇక్కడ కొనండి
- TET / DSC ప్రాక్టీస్ బిట్స్ బుక్ – ఇక్కడ కొనండి MASTER TV EDUCATION APP
- జనరల్ స్టడీస్ & జీకే బెస్ట్ బుక్ – ఇక్కడ కొనండి Amazon Link